Breaking News

గుణ‌ద‌ల మేరీమాత ఉత్స‌వాల‌ ముగింపు వేడుక‌ల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే…!

విజ‌య‌వాడ: ఫిబ్రవరి 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: త‌మిళనాడు వేళాంగిణి మేరీమాత ఉత్స‌వాల త‌ర‌ హాలో వ‌చ్చే ఏడాది మ‌రిం త వైభ‌వంగా, విజ‌య‌వాడ న‌గ‌ర శోభ మ‌రింత పెరిగే విధంగా గుణ‌ద‌ల మేరీమా త ఉత్స‌వాలు నిర్వ‌హిం చేందుకు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి కృషి చేస్తాన‌ని ఎంపీ కేశినేని శివ‌ నాథ్ తెలిపారు. దేశ‌విదేశా ల్లో గుణ‌ద‌ల మేరీమాత ఉత్స‌వాల గురించి చెప్పు కునే విధంగా మ‌రిన్నీవ‌స‌ తులు, స‌దుపాయాలు క‌ల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామ‌న్నారు.
దక్షిణ భారత దేశంలోనే ప్ర‌ముఖ‌ క్రైస్తవ పుణ్యక్షేత్రం గా వెలుగొందుతున్న గుణ దల మేరీమాత ఉత్స‌వాల ముగింపు వేడుక‌లు బుధ‌ వారం జ‌రిగాయి. ఈ కార్య‌ క్ర‌మానికి ముఖ్యఅతిథు లుగా విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ హాజ‌ర‌ య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ల‌ను బిష‌ప్ తెల‌గ‌తోటి రాజారావు ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్బంగా పాద‌ర్ లకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ తృణ ధాన్యాల‌తో కూడిన‌ బ‌హుమ‌తి అంద‌జేశారు. అనంతరం బిష‌ప్, పాద‌ర్ ల‌తో క‌లిసి మేరీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలం దరికీ మేలు జరగాలని ప్రార్థనలు నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినే ని శివ‌నాథ్ మాట్లాడుతూ ప్ర‌తి ఏటా సంప్ర‌దాయబ‌ ద్ధంగా నిర్వ‌హించే ఈ ఉత్స‌వాల‌లో పాల్గొని మేరీ మాత ఆశీస్సులు తీసుకో వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విజయవాడ కు గుణదల మేరీమాత ఉత్సవాలు ఎంతో ప్రతిష్టా త్మకమమంటూ, మేరీమా త ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం తో జిల్లా యంత్రాంగం చక్కటి ఏర్పాట్లు చేశారని అభినందించారు. దేశంలో ఎంతో పేరుగాంచిన క్రైస్త‌వ‌ పుణ్య‌క్షేత్రాల‌లో ఒక‌టిగా ప్ర‌సిద్ది గాంచిన గుణ‌ద‌ల మేరీమాత దేశ‌వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తుల నీరా జ‌నాలు అందుకుంటూ మత సామరస్యానికి ప్ర‌తీక‌ గా నిలుస్తుంద‌న్నారు.
ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ అసెంబ్లీలో రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల్లో పాల్గొన‌టానికి ముందుగా మేరీమాత ఆశీస్సులు అందుకోవ‌టం ఎంతో సంతోషంగా వుంద‌న్నారు. మేరీమాత దివ్య‌ ఆశీస్సు లతో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వున్నార‌ని తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో వికార్ జ‌న‌ర‌ల్ రెక్ట‌ర్ మువ్వ‌ల ప్ర‌సాద్, రెక్ట‌ర్ గుణ‌ద‌ల పుణ్య‌క్షేత్రం ఏలేటి విలియ్ జ‌య‌రాజు, గుణదల చర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్.విజ యరాజు, టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియ‌న్ సెల్ అధ్య‌క్షుడు ఊర్ల మోహ‌న్ రావు, టిడిపి క్రిస్టియ‌న్ నాయ‌కులు ఇత్త‌డి చార్లెస్, చాట్ల రాజ‌శే ఖ‌ర్, టిడిపి నాయ‌కులు మాదిగాని గురునాధం, గొల్ల‌పూడి మార్కెట్ యార్డ్ డైరెక్ట‌ర్ ప‌ర్వ‌త‌నేని ర‌త్న‌శ్రీ, ఎమ్.ఆర్.పి.ఎస్ నాయ‌ కులు మానికొండ శ్రీధ‌ర్ లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఆర్టీసీ బస్సులు – ఆర్టీసీ సిబ్బందితోనే నడవాలి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *