బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మట్టి మాణిక్యాలను వెలికితీయడమే శాప్ లీగ్స్ లక్ష్యం.

మట్టి మాణిక్యాలను వెలికితీయడమే శాప్ లీగ్స్ లక్ష్యం.

విజయవాడ. ఫిబ్రవరి 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాప్ లీగ్స్ అమలు విధానంపై నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో శాప్ ఏండి శ్రీమతి ఎస్. భరణి, IFS తో కలిసి శాప్ ఛైర్మన్ రవి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ శాప్ కార్యాల యంలో శాప్ లీగ్స్ సమావే శం నిర్వహించారు. ఈ సమావేశంలో ఛైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకం, శిక్షణ, వన రులు అందించి ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. శాప్ లీగ్స్ కేవలం పోటీలు నిర్వహించే కార్యక్రమం మాత్రమే కాకుండా, గ్రామ స్థాయి నుంచి క్రీడా సంస్కృతిని బలోపేతం చేసే మహత్తర క్రీడా ఉద్యమమని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే ప్రతిభను గుర్తించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, ఫిట్‌నెస్, పోషకాహారం, శారీరక సామర్థ్యాల ఆధారంగా ఎంపిక చేసి, వారికి క్రీడా కిట్లు, అవసరమైన పరికరాలు, ఆర్థికసహాయం అందించడమే కాకుండా, ప్రముఖ క్రీడా అకాడమీలతో అనుసంధానం చేసి నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ కల్పించను న్నట్లు తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను సమర్థవంతంగా పనిచే యించేలా చర్యలు తీసు కుంటున్నామని, P4 మోడ ల్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, క్రీడా సంఘాలు, విద్యా సంస్థలు భాగ స్వాములు గా ఉండే విధంగా సమన్వయం కల్పిస్తున్నామని వెల్లడించారు. గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా వాతావ రణాన్ని విస్తరించి, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా శాప్ లీగ్స్ కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పారు.

ఈ సంవత్సరం లో మొత్తం 32 క్రీడా విభాగాలతో శాప్ లీగ్స్ నిర్వహిస్తున్నామని, ఈ లీగ్స్ ద్వారా రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు శాప్ లీగ్స్‌ను జిల్లాల వారీగా సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతిభను పారదర్శకంగా గుర్తించి ప్రోత్సహించాలని ఛైర్మన్ సూచించారు. రాష్ట్రంలో క్రీడా విప్లవానికి ఇది నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాప్ ఏవో ఆర్.వెంకట రమణ నాయక్, క్రీడా అధికారులు, అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, స్కూల్ గేమ్స్ సెక్రటరీలు శాప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు