బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య.

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వేంపల్లెలోని తాళ్ళపల్లె గ్రామానికి చెందిన సి. మణికంఠ రెడ్డి (25) అనే రైతు అప్పుల బాధతో మృతి చెందాడు. మృతిని బంధువు నాగార్జున రెడ్డి పిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాళ్ళపల్లె గ్రామానికి చెందిన వెంకట లక్ష్ముమ్మ కుమారుడు సి. మణికంఠరెడ్డి తనకు ఉన్న 5 ఏకరాల పోలంలో అరటితో పాటు ఆయా పంటలు సాగు చేసుకొని జీవనం సాగిస్తుంచే వాడు . అయితే సాగు చేసిన పంటల్లో గిట్టుబాటు కాకపోవడంతో ఆదాయం రాలేదని తెలిపారు. పంటల సాగు చేసేందుకు నీరు లేక పోవడంతో మృతుడు మణికంఠ రెడ్డి బోర్లు వేయడానికి దాదాపు రూ 15 లక్షలు అప్పులు చేసినట్లు బంధువులు తెలిపారు. అప్పులు తెచ్చి బోర్లు వేసినప్పుటికి నీళ్లు పడక పోవడంతో అప్పులు ఎక్కువ అయినట్లు తెలిపారు. తెచ్చిన అప్పులు తీర్చలేక జనవరి 17 వ తేదిన తాళ్ళపల్లె గ్రామంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గడ్డి మందు తాగిన విషయం తెలుసుకున్న బంధువులు చిక్సిత కోసం కడప, కర్నూలు, ప్రాంతాల్లోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి సరిగా లేక పోవడంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మంగళవారం రాత్రి రైతు మణికంఠరెడ్డి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.మృతునికి తల్లితో పాటు 9 నెలల చిన్నారి ఉంది. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు