బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కిసాన్ నగర్‌లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.

కిసాన్ నగర్‌లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మరొ ఇద్దరిపై మూడు కేసులు నమోదు.

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కిసాన్ నగర్ పరిధిలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలపై పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. కిసాన్ నగర్ లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు వేరు వేరుగా ఓటర్లకు నగదు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.వారిలో ఒకరు కరీంనగర్ అంబేద్కర్ నగర్ కు చెందిన కుర్ర తిరుపతి (45) వద్ద 44 వేల 500 వందల రూపాయల నగదుపట్టుబడగా అతనిపై కేసు నమోదు (Cr. No. 52/2026, USec. 173, 223 BNS Act, r/w 171-H P.R. Act: ) చేసారు.

ఎమ్మెలే గంగుల కమలాకర్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు. కిసాన్ నగర్ కు చెందిన లొకిని జంపయ్య(35)
నుండి 47 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా, స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా, అనధికారికంగా విడిపించుకుని వెళ్లడంతోపాటు, ఘటన జరిగిన ప్రదేశంలో ధర్నా చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించారు. ఈ చర్య ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందుకుగాను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు కుర్ర తిరుపతి,ఎడ్ల. అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, పెరుక మంజుల, బేజుగం మధు లను బాధ్యులను చేస్తూ మొత్తం 08మందిపై మరో కేసునమోదు ( Cr. No. 53/2025, U/sec. 173, 221, 223, 126(2), r/w 3(5) BNS Act, sec. 171-H of PR Act:- ) చేసినట్లు కరీంనగర్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గుర్రం తిరుమల్ తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

అంతేకాకుండా ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించి ఓటర్లను, వారికే ఓటు వేయాలని కోరి ఎన్నికల నియామవాళి ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు, ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతిలపై మరొక కేసు నమోదు ( మూడవ కేసు Cr. No. 54/2026, u/sec. 223 r/w 3(5) BNS Act: ) చేసారని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్ తెలిపారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు.