బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి.

కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి.

లేబర్ కోడ్ లను రద్దు చేయాలి – సీఐటియు

జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్.

కేంద్ర నియంతృత్వ పాలన నశించాలి.

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు.

మైలవరం, ఫిబ్రవరి 12: (తెలుగు పత్రిక): కార్మిక చట్టాలు రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటిదట కల్పించాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డునీ పునరుద్ధరించాలని కార్మిక, కర్షక సంఘాల పిలుపు దేశవ్యాప్త సమ్మె లో భాగంగా గురువారం మైలవరంలో సిఐటియు కార్యాలయం నుండి కార్మికులు పెద్దఎత్తున ర్యాలీగా బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్ కేంద్ర ప్రభుత్వం నియంతృతం పాలనతో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి వాటి స్థానాలలో పని గంటకు పెంచుతూ నాలుగు లేబర్ కోడ్లను ఎటువంటి హక్కులు లేకుండా తీసుకువచ్చిందని అన్నారు. ఈ లేబర్ కోడ్ లను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు అందించే ఎరువుల పై సబ్సిడీని తగ్గించి, గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం సంస్థలను కార్పొరేట్లు దారాదత్తం చేస్తూ దేశంలోని యువతను నిరుద్యోగులుగా మారుస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా రాష్ట్రనికి అన్యాయం చేసినా రాష్ట్రలోని పాలక పార్టీలు నోరు మెదపక పోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికుల డిమాండ్ లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి జ్యోతి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ ఆర్ వి పుష్పకుమారి, సిహెచ్ శారద, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డి శ్రీనివాసరావు, మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం శ్రీను, సురేష్ బాబు, సీనియర్ నాయకులు తెనాలి నరసింహారావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు వై వీరమ్మ, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు తిరుపతిరావు, రైతు సంఘం మండల నాయకులు వి వెంకటరెడ్డి ,రావుల సుబ్బారావు, మిడ్ డే మీల్స్ యూనియన్ నాయకులు వెంకటరత్నం, హకర్స్ యూనియన్ నాయకులు బాబురావు, శివ, సంఘీభావం తెలిపిన యుటిఎఫ్ జిల్లా కోశాధికారి గంగరాజు, గవర్నమెంట్ హాస్పిటల్స్ పేపర్స్ యూనియన్ నాయకులు రమేష్,వెన్డర్స్ యూనియన్ సురేష్, వివిధ సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు.