బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మూడవ జోన్ ఆయకట్టుకు సాగర్ జలాలు విడుదల చేయాలి.

మూడవ జోన్ ఆయకట్టుకు సాగర్ జలాలు విడుదల చేయాలి.

అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి.

మైలవరం, ఫిబ్రవరి 12: (తెలుగు పత్రిక): నాగార్జునసాగర్ ప్రాజెక్టు మూడో జోన్ పరిధిలోని ఆయకట్టుకు తక్షణమే సాగర్ జలాలు విడుదల చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కోరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఉదయం జీరో అవర్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ సాగునీరు లేక మైలవరం నియోజవర్గ రైతులు పడుతున్న అవస్థలను అసెంబ్లీలో ప్రస్తావించారు. సాగునీటి సమస్యలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్.ఎస్.పి మూడవ జోన్ కు 14 టీ.ఎం.సీల నీరు కేటాయించగా ఇప్పటివరకు కేవలం 1.6 టీ.ఎం.సీల నీరు మాత్రమే విడుదల చేశారన్నారు. మూడవ జోన్ పరిధిలో సాగు చేస్తున్న మొక్కజొన్న, తదితర ఆరుతడి పంటలకు నీరు అత్యవసరం అన్నారు. సాగునీటి విడుదల కోసం కిందిస్థాయి అధికారులు తెలంగాణా అధికారులతో మాట్లాడితే స్పందించడం లేదన్నారు. వారికి అవసరం లేనప్పుడు మాత్రమే నీటిని దిగువకు విడుదల చేస్తామని చెబుతున్నారని, మన రాష్ట్రానికి అవసరం అయినప్పుడు సాగునీటిని విడుదల చేయడం లేదన్నారు. ఈ యేడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, రిజర్వాయర్లు అన్నింటిలో నీళ్లు ఉండి కూడా సకాలంలో సాగునీటిని సరఫరా చేయకపోతే అది మన వైఫల్యమేనన్నారు. రైతులు వేసిన పంటలు కాపాడుకోవాలంటే వరుసగా 10 రోజుల పాటు నిరంతరాయంగా నీళ్లు ఎన్.ఎస్.పి మూడవ జోన్ కు విడుదల చేయాలని అన్నారు. ఈ విషయంలో గౌరవ మంత్రి నిమ్మల రామానాయుడు తెలంగాణ మంత్రితో పాటు, ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీటిని విడుదల చేయించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కోరారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు