ముంబాయి. ఫిబ్రవరి 12 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: గోద్రేజ్ ఆగ్రోవెట్ సరికొత్త కీటక నాశని టకాయ్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో గోద్రేజ్ ఆగ్రోవెట్ క్రాప్ ప్రొడక్షన్ బిజినెస్ సీఈవో ఎస్ కే రాజవేలు మాట్లాడుతూ భారతదేశంలో వైవిధ్య భరితమైన వాతావరంలో వరి సాగు చేసిన రైతుల ప్రయోజనాల కోసం తమ సంస్థ టకాయ్ ని అందుబాటులో కి తెచ్చిందని చెప్పారు. జపాన్ కు చెందిన ఐఎస్కే సంస్థ సైక్లాప్రిన్ టీహెచ్ఎం టెక్నాలజీతో ఈ టకాయ్ ని రూపొందించిందని తెలిపారు. వరిలో ప్రధానంగా కాండం తొలిచే పురుగు, ఆకు ముడత పరుగులను నాశనం చేయ డంలో ఇది అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని వివరించారు. నాట్లు వేసిన తర్వాత కీలకమైన ప్రాథమిక దశ అయిన 15 నుంచి 30 రోజుల మధ్య ఒకసారి, మళ్లీ 40 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి 160 మిల్లీ లీటర్ల మోతాదులో పిచికారీ చేయాల్సి ఉంటుం దని చెప్పారు. ఈ మందు పంటలను ఆశించిన పురు గులు ఆహారం తీసుకోకుం డా తక్షణమే అడ్డుకుంటుం దని, దీర్ఘకాలం పాటు తెగుళ్లను అదుపు చేస్తుందని తెలిపారు. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని, ఉత్పత్తి పెరుగుతుందని, స్థిరమైన మంచి ఆదాయం వస్తుంద ని పేర్కొన్నారు. టకాయ్ అనేది వరితో పాటు మొక్క జొన్న, మిరప, క్యాబేజీ, సోయాబీన్, శనగ, చెరుకు బ పంటలకు కూడా వినియోగించవచ్చని వివరిం చారు. రైతుల ప్రయోజనా లు, పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ చిత్తశుద్ధి తో పని చేస్తుందని చెప్పారు. ఈకార్యక్రమంలో జోన ల్ హెడ్ మధు, అసిస్టెంట్ మేనేజర్ మురళి మోహన్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
