Breaking News

కల్లుగీత కార్మికులు వృత్తివేషధారణతో తాటిచెట్టు ఎక్కి నిరసన !

సూర్యాపేట, ఫిబ్రవరి 12( నేటి తెలుగు పత్రిక): నిరసన సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు హాజరైమాట్లాడుతూ విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ లను 6 సంవత్సరాల క్రితం 2019, 2020 సంవత్సరాలలో తెచ్చి కార్మిక సంఘాలు ,కార్మిక చట్టాలులేని దేశంగా మార్చాలని కార్మికులని నీరాయుదులను చేసి పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు లక్షలాది కోట్ల రూపాయలు లాభాలు పెంచేందుకు 2025 నవంబర్ 21న లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ చట్టం అనేక చట్టాలు తీసుకువచ్చి పేద మధ్యతరగతి, రైతాంగం ,చిరు వ్యాపారస్తులకు, కల్లుగీత కార్మికులకు, చేతివృత్తుదారులకు, ఎలాంటి సంక్షేమం కేంద్రాన్ని పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ ల అమలుతో 40 కోట్ల సంఘటిత, ఆసంఘటిత కార్మికులు రైతులు, చేతి వృత్తిదారులు, వారి కుటుంబాలు చితికి పోయేలా చట్టాలను మారుస్తున్నదని బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం.1926 ప్రకారం యూనియన్లు ఏర్పాటు కార్మికుల హక్కు, ఆ సంఘటితమయ్యే హక్కు నిరసనలు, సమ్మె చేసే హక్కులపై ఉక్కు పాదం మోపుతున్నారని విమర్శించారు. ఉద్యోగ భద్రత పట్ల యజమాన్యాలకున్న అన్ని బాధ్యతలను తొలగించారని విమర్శించారు.
హైర్ అండ్ ఫైర్ పద్ధతి తీసుకొచ్చి పర్మినెట్ ఉద్యోగాలకు మంగళం పాడారు. కోర్ యాక్టివిటీ లో సైతం విచ్చలవిడిగా కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడం చట్టపరం చేశారు. ఫిక్స్డ్ టర్మ్ ఉపాధిని శాశ్వతం చేసింది ఈ విధానవల్ల పెట్టుబడిదారులకు అనేక రేట్లు లాభాలు పెంచేందుకు అవకాశం కల్పిస్తుందని విమర్శించారు.
లేబర్ అధికారుల కోరలు పీకి ఫెసిలిటేటర్ గా మార్చి వారిని మధ్యవర్తులుగా రాయబారాలు చేసే వారిగా నిర్ణయించారు. భవన ఇతర నిర్మాణ కార్మికులకు అలాగే అంగన్వాడి, ఆశ ,మధ్యాహ్న భోజనం ,ఐకెపి, వివోఏ, ఆర్ పి, ఉపాధి హామీ నేషనల్ హెల్త్ మిషన్ లాంటివి స్కీం లల్లో పనిచేస్తున్న వారిని కనీసం కార్మికులు గా కూడా గుర్తించడం లేదని విమర్శించారు.
అదేవిధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సరైన బడ్జెట్ కేటాయించకుండా మహాత్మా గాంధీ పేరును తొలగించి వి. జి .రాంజీ పేరు పెట్టాలని ఆలోచన చాలా దుర్మార్గమైన ఆలోచన అని అన్నారు వెంటనే వి. జి .రాంజీ పేరును వెంటనే రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో కొనసాగించాలని ఆ పథకానికి సరైన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
కావున కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్స్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులు ,కర్షకులు, చేతివృత్తిదారులు రైతులు, చిరు వ్యాపారులు, కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుణగంటి కృష్ణ, మొక్కనాగేశ్వరరావు , పూటిగంటి నాగయ్య, దేశ గాని వెంకన్న, భూపతి అంజయ్య, ఎలుగూరి రాములు, ఎంగలి సత్తయ్య, తంతెనపల్లి నాగయ్య, మొక్క మల్సూర్, తదితరులు పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాలికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *