- యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ పదవి మాదే.
మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్టీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి.
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 12 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఓటమి పాలుకాబోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీ అభ్యర్థుల కొనుగోలుకు తెరలేపిందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్టీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జోలికొస్తే తరిమికొడతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో మీడియా సమావేశంలో పాల్గొని పట్టణ ఓటర్లకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డులో ఓడిపోతామని భావించే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆవుల మమతాసాయియాదవ్ను అప్రజాస్వామికంగా కొనుగోలు చేశారన్నారు. ప్రత్యక్ష ఓటింగ్లో పాల్గొనే దమ్ములేక స్థానిక ఎమ్మల్యే బీర్ల అయిలయ్య ఇలా డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కొనుగోలు చేయాలని ఇప్పటికే వ్యూహాలు పన్నుతున్నట్లుగా సమాచారం వచ్చిందన్నారు. ఏ ఒక్క అభ్యర్థిని కొనుగోలు చేస్తే యాదగిరిగుట్ట అగ్నిగుండంగా మారుస్తామని చెప్పారు. శవయాత్రలు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను ఎండగడతామన్నారు. దమ్ముంటే పోటీలో గెలిచినిలవాలన్నారు. ఇలా సిగ్గులేకుండా డబ్బులతో కొనుగోలు చేస్తామంటే చూస్తు ఉదుకునే ప్రసక్తేలేదన్నారు. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ పదవి మాదేనని, ఇందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను గెలుచుకుని తీరుతామన్నారు. 11 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా 10 వార్డుల్లో పోటీలో నిలిచామని 3 వార్డుల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2,3,4,5,7,8,9, 11, 12 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారని తెలిపారు. అభ్యర్థుల మంచితనంతోపాటు కేసీఆర్ను ప్రజలు కోరుకోవడం, గత ప్రభుత్వ హాయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులకు గెలుపు బాటలు వేశాయన్నారు. ఈ సారి అన్ని కులాల సముచ్చిత గౌరవం ఇచ్చామన్నారు. మైనార్ట్, ఎరుకల, నాయీ బ్రాహ్మణలు, దొమ్మర, గౌడ్, యాదవ, ఎస్సీ కులస్తులకు సీట్లను కేటాయించామన్నారు. 12 వార్డు అభ్యర్ధిగా దొమ్మర కులానికి చెందిన కంసాని కీర్తికి సీటును ఇచ్చామన్నారు.
గతంలో ఏ పార్టీ దొమ్మర కులాన్ని గుర్తించలేడన్నారు. దొమ్మర కులానికి చెందిన మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్కను వెల్లగక్కుకున్నారన్నారు. అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటిని పోలీసులను పెట్టించి సోదాలతో ఇబ్బందులకు గురి చేశారన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బులే లక్ష్యంగా ప్రచారం సాగించారన్నారు. ఓటర్లను ప్రలోబాలకు గురిచేశారన్నారు. ప్రతి ఓటరుకు డబ్బు, మధ్యం సరఫరా చేశారన్నారు. మహిళలకు చీరెలు, వెండి వస్తులను ఇచ్చి ఓట్లను దండుకునే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశామా అని ప్రజలు భావిస్తున్నారన్నారు. కేసీఆర్ ఉంటేనే మంచిదన్న భావనలో ప్రజలు ఉన్నారన్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోస్తే కారుగుర్తుకు ఓటేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. కేసీఆర్ మార్క్ ఓటు అని వారే తమకు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నా ఈ సారి మాత్రం కారుగుర్తుకే ఓటేస్తామని స్పష్టం చేసిన్నట్లు వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు బీమగాని నర్సింహ్మాగౌడ్, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు ముక్కర్ల సతీశ్ యాదవ్, 5వ వార్డు అభ్యర్థి మానుపాటి పరుశరాం, నాయకులు కల్వకోలను సతీశ్ భట్, లింగం, శారాజీ రాజేశ్ యాదవ్, మిట్ట నర్సింగ్, నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు…
