బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

పోలింగ్ ప్రక్రియ కు భారీ బందోబస్తు.

పోలింగ్ ప్రక్రియ కు భారీ బందోబస్తు.

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. గురువారం కరీంనగర్ లోని అస్త్ర కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన పోలీస్ బ్రీఫింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు కౌంటింగ్ కేంద్రం వెలుపల 100 మీటర్ల దూరం నుండే తనిఖీలు ప్రారంభమవుతాయి. అనుమతి పత్రాలు (Passes) ఉన్న వారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు.ఏజెంట్లు, అభ్యర్థులు, సిబ్బంది తమ వెంట అగ్గిపెట్టెలు, సిగరెట్లు, వాటర్ బాటిళ్లు, ద్రవ పదార్థాలు (Liquids), మరియు ఇతర ఫ్లెమబుల్ (మంటలు చెలరేగే) వస్తువులను తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించారు.ఎన్నికల కమిషన్ జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు.

​ కౌంటింగ్ కేంద్రాల వద్ద మరియు నగర వ్యాప్తంగా నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిఘా ఉంచుతామని సీపీ తెలిపారు.కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. డీజే (DJ) వినియోగంపై పూర్తి నిషేధం ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే డీజే పరికరాలను సీజ్ చేయడమే కాకుండా సంబంధిత వ్యక్తులపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఎన్నికల ఫలితాల వేళ ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సీపీ గౌష్ ఆలం కోరారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు