పులివెందుల ఫిబ్రవరి 12 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): అధికారం లో ఉండి కూడా ఒక్క రూపాయి కూడా పులివెందుల ప్రాంతానికి తీసుకురాలేని అసమర్థుడు అధికారం లో ఉన్నా లేకున్నా పులివెందుల మున్సిపాలిటీ లోని భాకరా పురం, న్యాక్ బిల్డింగ్, ఎర్రగుడి పల్లి, కమ్యూనిటీ హాల్ కోసం దాదాపు రెండు కోట్ల రూపాయల ఎంపీ నిధులు తెచ్చిన ఘనత వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి గారిదేనని వైసీపీ నేతలు వజమెత్తారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల ప్రజలకు వైఎస్ కుటుంబానికి మధ్య ఉన్న ఆత్మీయత వెలకట్టలేనిది, పులివెందుల ప్రాంతం వైఎస్ జగన్, వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో సస్యశ్యామలంగా ఉండేది,కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూదానికి,కోడి పందేలకు,అక్రమ మైనింగ్ కు అడ్డాగా మార్చిన ఘనత బోగస్ రవిదే, పార్లమెంట్ లో ఎంపీ గారు రాష్ట్రానికి జిల్లాకు సంబంధించిన కీలకాంశాల గురించి మాట్లాడిన మాటలు నీకు వినపడలేదా, కనపడలేదా కేవలం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ క్రింద ఉన్న పౌల్ట్రీ రైతుల ఆవేదన గురించి మాట్లాడితే దాన్ని వక్రీకరించి మాట్లాడి, ప్రెస్ మీట్ లో నీ ప్రక్కన ఉన్న వారే నవ్వుకొనే విధంగా కమెడియన్ గా అపహాస్యం పాలు అవుతున్నావు , నిజంగా ఇది అనవసరం అయితే కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం , ఈ బడ్జెట్ లో కూడా 8900 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది ఈ విషయం బోగస్ రవికి తెలియక జోకర్ లా వ్యవహరిస్తున్నడు. మార్కెట్ లో అరటి ధరలు 3000 రూపాయలు ఉన్నప్పుడు కనీసం చలనం లేని ప్రభుత్వం జగన్ గారు రైతులకు సంఘీభావంగా మాట్లాడటం రాద్ధాంతం అంటున్నాడు, సొంత నియోజకవర్గం లో రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు బోగస్ రవి ఎక్కడ విలాసాలు చేస్తున్నాడో అర్థం కాలేదు అసలు ధరలే తగ్గలేదు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ధర బాగున్నప్పుడు దానికి మేమే కారణం అని కనీసం వ్యవసాయ పరిజ్ఞానం లేకుండాచెప్పుకోవడం సిగ్గుచేటు,గిట్టుబాటు ధరలు లేనప్పుడు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి రైతులకు మేలు చేసి నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, ఇప్పుడు ఉల్లి, సెనగ రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది
గండికోట, చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులు సంవృద్ధిగా జలకళతో ఉండటానికి వైఎస్ కుటుంబమే కారణం, ఏదో గ్రావిటేషన్ ద్వారా హంద్రీ నీవా నుంచి సహజంగా ఎర్రబల్లి చెరువు నిండితే దానికి నేనే కారణం అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది , ఆ హంద్రీనీవాకు కు అంకురార్పణ చేసింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి గారే అసెంబ్లీ లో ప్రజా సమస్యల పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రస్తావిస్తుంటే ఏ మాత్రం పట్టించుకాకపోగా భాద్యత లేకుండా ఆత్మస్తుతి పరనింద లాగా చంద్రబాబు ను పొగడటమే ధ్యేయంగా సాగుతున్న అసెంబ్లీ ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ కి వెళ్లాలా వద్దా అని చెప్పే అర్హత , సంస్కారం నీకు లేదు, జెడ్పీ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి ప్రజల ఓట్లు చోరీ చేసిన నువ్వు , ఈ సారి ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తావో అని ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.ఎవ్వరైనా జన్మదిన వేడుకలకు సేవా కార్యక్రమాలు చేయడం పరిపాటి కానీ నీ పుట్టిన రోజు వేడుకలకు ఎడ్ల పందేలు, కోడి పందేలు జరపడము , జూద శాలలు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలు, రెచ్చగొట్టే ప్రెస్ మీట్లు కాకుండా ప్రజలకు మంచి చేసే పనులు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. కార్యక్రమం లో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్నప్ప, పట్టణ కన్వీనర్ హాల్ గంగాధర్ రెడ్డి,సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మునిసిపల్ వైస్ ఛైర్మెన్ హఫీజ్, రసూల్, కౌన్సిలర్ లు పార్నపల్లి కిషోర్,రాజశేఖర్ రెడ్డి, ఖాదర్, రవి కో ఆప్షన్ చంద్రమౌళి, వైసిపి నాయకులు ఇరికి రెడ్డి జగన్ రెడ్డి, కనక, ఈశ్వరయ్య, జిలాన్ తదితరులు పాల్గొన్నారు.
