Breaking News

పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాలికలు

కేజీబీవీలో విచారణ జరుపుతున్న అధికారులు.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 11 మంది బాలికలపై ఎలుకల దాడి.

ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే బాలికల పాలిట శాపంగా మారింది.

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఎ.కొండూరు ఫిబ్రవరి 12 (నేటి తెలుగు పత్రిక): మండల కేంద్రమైన ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, కళాశాలలో ఎలుకలు దాడి చేసి పలువురు బాలికలను గాయపరిచిన సంఘటన ఇది.సేకరించిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి బాలికలు విద్యాలయంలో రాత్రి నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఎలుకలు దాడి చేశాయని బాలికలు విలేకరులకు తెలిపారు.ఈ క్రమంలో విద్యాలయంలో సిహెచ్, ప్రసన్న,కావూరి కళావతి, శ్యామల కుమారి,కోటా శ్రీ వర్షిత, బొజ్జవరపు దీవెన,తాణంకి కీర్తి, నక్క బోయిన యశ్విత, శ్రీకాకుళపు నవ్యశ్రీ,పి. ప్రణతి,మల్లాది రజిని, వాసం స్నేహ,ఎలుకల దాడిలో గాయపడ్డారు. ఈ విషయాన్ని విద్యాలయ, కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమె హుటాహుటిన బాలికలను గురువారం సాయంత్రం మండల ప్రాథమిక వైద్యశాలకు తీసుకువెళ్లి అక్కడ పనిచేస్తున్న డాక్టర్ దివ్య, డాక్టర్ స్వాతి పర్యవేక్షణలో బాలికలకు చికిత్స అందించారు. అయితే ఈ విషయం అందరికీ తెలియటంతో అప్పటికప్పుడు సిబ్బంది ఆసుపత్రికి తరలించడం జరిగిందని బాలికలు తెలిపారు.గతంలో కూడా ఇదే విద్యాలయంలో బాలికలపై ఎలుకల దాడి జరగడంతో ఈ విషయంపై పలు వార్త పత్రికల్లో కథనాలు రావడంతో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, తిరువూరు డివిజనల్ అధికారి కె. మాధురి పర్యవేక్షించి డార్మెంటరీ లో ఉన్న కిటికీల నుండి ఎలుకలు వచ్చే విషయాన్ని గమనించి ఎలుకలు రాకుండా మెస్ ఏర్పాటు చేయమని గతంలో ఇక్కడ పనిచేసిన కేజీబీవీ ప్రిన్సిపాల్ కు సూచించడం జరిగింది. అయితే కనీసం కిటికీలకు మేస్ లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో మరోసారి బాలికలపై ఎలుకల దాడి జరిగిందని బాలికల తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యాలయ ప్రాంగణంలో వెనుక వైపు శానిటరీ ట్యాంక్ నిండిపోయి అటువైపు కనీసం వెళ్లలేనంత దుర్గంధం వెదజల్లుతున్నప్పటికీ విద్యాలయాన్ని పర్యవేక్షిస్తున్న జిల్లా స్థాయి అధికారులకు కనీసం ఈ విద్యాలయంలో జరుగుతున్న పరిణామాలు కనబడటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విద్యాలయానికి సంవత్సరానికి మెయింటినెన్స్ ఫండ్ నిమిత్తం సుమారు రెండు లక్షలు వస్తున్నా అధికారులు మాత్రం ఆ నిధులను మరమ్మత్తులకు ఉపయోగించడం లేదనే వాస్తవ పరిస్థితులు విద్యాలయంలో కళ్ళకు కొట్టవచ్చినట్లు కనపడుతున్నాయి. ఈ విషయం సేంద్రియ ఎరువుల స్థల పరిశీలనకు మండలానికి వచ్చిన జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా కు తెలియటంతో అక్కడే ఉన్న తిరువూరు డివిజన్ అధికారి కె. మాధురిని పిలిచి బాలికలపై ఎలుకల దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు నివేదికను పంపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆమె మండల తహశీల్దార్ ఎన్.అరవింద్,మండల అభివృద్ధి అధికారి,బి. శ్రీనివాసరావు,మండల విద్యాశాఖాధికారి,ఈ ఎల్ సి కేశవరావును విచారణ జరిపి వెంటనే ఎలుకల దాడి ఘటనపై నివేదికను పంపాలని ఆమె వారికి సూచించారు. ఈ విషయంపై కేజీబీవీలో ఎలుకల దాడిలో గాయపడిన బాలికలతో అధికారులు మాట్లాడి వారికి అందిన వైద్య సహాయం గురించి తెలుసుకొని ఎలుకలు వచ్చే ప్రదేశాన్ని చూసి అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, సిబ్బంది తీరును తప్పు పట్టారు.వెంటనే ఎలుకలు వచ్చే కిటికీలకు మెస్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఎలుకల దాడి ఘటన పై జరిపిన విచారణను ఆర్డీవోకు, జిల్లా కలెక్టర్ కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జి సి డి ఓ బి.విశ్వ భారతి ప్రిన్సిపాల్,విజయ సుందరి, బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పశు సంపదను పెంచండి _ తాజా పాలను సేవించండి_ఆరోగ్యంగా ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *