Breaking News

మహాశివరాత్రి సందర్భంగా మెట్ల మార్గంలో భారీ అన్నదాన కార్యక్రమం

వేలాది భక్తులకు అన్నప్రసాద వితరణకు సిద్ధమైన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గంలో వేలాది భక్తులకు అన్నదానం.

ఫలించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వ్యూహం

శివనామస్మరణతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలి.

మహాశివరాత్రి పర్వదినం – భక్తి, నియమ నిష్ఠలకు ప్రాధాన్యం.

కరీంనగర్ కార్పొరేషన్ లో వికసించిన కమలం.

మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఈనెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గం వద్ద భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం మంగళగిరి పట్టణంలోని ఆయన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పందేటి సాంబశివరావు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు నిరంతరంగా అన్న ప్రసాద వితరణ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. సుమారుగా 7 నుంచి 8 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించునున్నట్లు ఆయన తెలిపారు.ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 40 మంది కార్యవర్గ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.అదేవిధంగా ప్రతి నెల అమావాస్య రోజున మెట్ల మార్గం వద్ద వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని, ముక్కోటి పర్వదినాన నాలుగు రకాల ప్రసాదాలతో భక్తులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్తరించుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు.మహాశివరాత్రి సందర్భంగా మహాశివుని ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలయాలకు విచ్చేసి పరమశివుని దర్శించుకోవడం వల్ల ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని ఆయన అన్నారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేసి, శివనామ స్మరణలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని తెలిపారు. మహాశివరాత్రి ఆచరణతో కుటుంబాలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, శుభఫలితాలు కలుగుతాయని పేర్కొన్నారు. భక్తులు నియమ నిష్ఠలతో ఈ వేడుకలను జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో కర్నాటి శివ సత్యనారాయణ, కగ్గ శ్రీనివాసరావు, కోదాటి శ్రీనివాసరావు, కటారి విష్ణుమూర్తి, గండికోట రాజారావు, అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, రెడ్డి వీర రాఘవులు, పందేటి శ్రీనివాసరావు, నల్లమల్ల నాగరాజు, నంద్యాల గోపాలకృష్ణ, మాచర్ల లక్ష్మీనారాయణ, బేతపూడి మధు, పంచెల్ల శివన్నారాయణ, పెరుమాళ్ళ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *