ఎ. కొండూరు ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక): కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వసతి గృహాలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. అయన శుక్రవారం ఎ కొండూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అక్కడ బాలికలపై ఎలుకలు దాడి చేసి కొరకడంతో వారిని పరామర్శించారు. అలానే బాలికల ఆరోగ్య పరిస్థితులపై స్వయంగా బాలికలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన విద్యాలయంలో ఎలుకల కాటుకు గురైన డార్మెంటరీ నిపరిశీలించి అక్కడ కిటికీలకు మెస్ సరిగా లేకపోవడాన్ని గమనించారు.
విద్యాలయంలో 12 మంది బాలికలు ఎలుకల కాటుకు గురికావడం విచారకరమనిసంఘటనజరిగిన వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి బాలికలకు వ్యాక్సిన్ వేయించడం వైద్యం చేయించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ లు ఈ విషయం తెలియడంతో విద్యాశాఖ రెవిన్యూ వైద్య ఆరోగ్యశాఖ మండల పరిషత్ అధికారులను అప్రమత్తం చేశారని దీంతో అన్ని శాఖల అధికారులు విద్యాలయాన్ని సందర్శించి బాలికల ఆరోగ్య పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన అన్నారు. విద్యాలయంలో పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని బాలికల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మెడికల్ క్యాంపును విద్యాలయంలోని ఏర్పాటు చేయించామని బాలికల ఆరోగ్యం పట్ల నిరంతరం ఆరోగ్యశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. విద్యాలయంలో మౌలిక వసతులకల్పనకు అన్ని చర్యలు తీసుకుంటామని విద్యాలయంలో అన్ని వసతులు సమకూర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ ఆదేశాల మేరకే తాము విద్యాలయాన్ని సందర్శించినట్లు ఆయన చెప్పారు ఈ సందర్భంగా ఆయన భోజనశాలను విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ చైర్మ.శావల దేవదత్, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధికార ప్రతినిధి, అలవాల రమేష్ రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు, భరోతు పీక్లా నాయక్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు పిట్టా చైతన్య పిఎసిఎస్ చైర్మన్ లు బెజవాడ శంకర్, చల్లపల్లి కృష్ణ, ముతకరాటపుహరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
