బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కస్తూర్బా బాలికల విద్యాలయానికి క్యూ కట్టిన అధికారులు

కస్తూర్బా బాలికల విద్యాలయానికి క్యూ కట్టిన అధికారులు
  • ఎలుకల కాటుకు గురైన బాలికలను పరామర్శిస్తున్న ఆర్డీవోకె. మాధురి.

ఎ.కొండూరు ఫిబ్రవరి 12 (నేటి తెలుగు పత్రిక): ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 12 మంది బాలికలను ఎలుకలు దాడి చేసి కొరకడంతో ఈ విషయమై వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు స్పందించిన జిల్లా అధికారులు స్పందించి శుక్రవారం ఎ.కొండూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు.ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, ఏపీసి,ఎం. రజిని, తిరువూరు డివిజనల్ అధికారి,కె. మాధురి, ఎ.కొండూరు తహశీల్దార్,ఎన్. అరవింద్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి,బి. శ్రీనివాసరావు, ఎంఈఓ, 2 ఈఎల్ సి కేశవరావు, ప్రాథమిక వైద్యశాల డాక్టర్ పి.దివ్య,వేముల స్వాతి విద్యాలయాన్ని సందర్శించి ఎలుకల దాడికి గురి అయిన బాలికలను పరామర్శించి వారి ఆరోగ్యస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల పట్ల నిర్లక్ష్యం వహించిన కేజీబీవీ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు అందించడం జరిగిందని విద్యాలయంలో వసతులు విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ లోపాలను యుద్ధ ప్రాతిపదికన సరి చేస్తామని తెలిపారు. పూర్తిస్థాయిలో శానిటేషన్ పనులను చేపట్టడం జరిగిందన్నారు. విద్యాలయంలో బాలికలను ఎలుకలు కరవడం విషాదకరం అని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎలుకల దాడికి గురి అయిన బాలికల ఆరోగ్యం విషయంలో నిరంతరం పర్యవేక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు