విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ గత ఏడాది కాలం నుంచి కేశినేని ఫౌండే షన్ ద్వారా హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాలయంలో స్వయం ఉపాధి కి సంబంధించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన ఎస్.హెచ్.జి మహిళల గ్రూపులతో ఎంపీ కేశినేని శివనాథ్ ఈ నెల 20 నుంచి స్వయంగా కలి సి మాట్లాడతారని కేశినేని ఫౌండేషన్ చైర్మన్, ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ తెలిపా రు. శిక్షణ అనంతరం ఎంట ర్ ప్రెన్యూర్స్ గా రాణించేం దుకు ఎదురయ్యే సమస్య లను ఎంపీ కేశినేని శివనాథ్ తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారని తెలిపారుహైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాలయంలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మొదలైన హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీ పై శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ ఐదు రోజుల శిక్షణా కార్యక్ర మంలో విజయవంతంగా నైపుణ్యాభివృద్ది శిక్షణ ను పూర్తి చేసిన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 40 మంది ఎస్.హెచ్.జి మహిళలకు సర్టిఫికేట్స్ అందించారు. అంతకుముందు హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయా రీ పై శిక్షణ పొందిన మహిళలందరితో మాట్లాడి శిక్షణలో భాగంగా ఏమి నేర్చుకున్నారో అడిగి తెలు సుకున్నారు. ఈమేరకు ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ కార్యాల యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా కేశినేని జానకీ లక్ష్మీ మాట్లా డుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఇంటిలో కనీసం ఒకఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలన్న ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముందడుగు వేశారని తెలి పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివ నాథ్ తన స్వంత నిధుల ను వెచ్చించి ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ ఇప్పిస్తూ ఎస్. హెచ్.జి మహిళలకు చేయూత అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ శిక్షణ లో నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు పుట్టుకతోనే బహుముఖ ప్రతిభ కలవారని,భార్యగా, తల్లిగా, చెల్లిగా అనేక బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం ఉన్న మహిళ లకు ఎంటర్ ప్రెన్యూర్ గా రాణించటం అంత కష్టం కాదని అభిప్రాయపడ్డారు. సరైన మార్గదర్శనం, అవ కాశాలు లభిస్తే మహిళలు కూడా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగగ లరని మీరంతా నిరూపిం చాలని కోరారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న ఎన్.ఐ. ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మాద్ ఖాన్, ప్రొఫసర్ డాక్టర్ కతిరేషన్, గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీం ద్రరావు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూరల్ కో-ఆర్డినేటర్ సొంగా సంజ య్ వర్మ లతో పాటు తది తరులు పాల్గొన్నారు.
