బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఆలేరు , యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచిన అనంతరం

ఆలేరు , యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచిన అనంతరం

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీడియాతో మాట్లాడారు.

బీర్ల అయిలయ్య కామెంట్స్

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బీఆర్ఎస్, బీజేపీలు కలిసి వచ్చినా కాంగ్రెస్‌ను ఎక్కడా తట్టుకోలేకపోయాయి. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి ఈ ఫలితాలే నిదర్శనం. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, యువతకు అవకాశాలు కల్పించడం, ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వంగా మా ప్రభుత్వం నిలిచింది.అందుకే ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.ఈ విజయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంకితం చేస్తున్నాను.యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు మున్సిపాలిటీలను భారీ మెజారిటీతో గెలిపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి విశేష ఆదరణ లభించింది.బీఆర్ఎస్, బీజేపీలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయాయి అంటే మా ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల విశ్వాసం స్పష్టంగా తెలుస్తోంది.ఈ నమ్మకంతోనే ఈ ఆరు మున్సిపాలిటీలను గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తాము. గత రెండేళ్లలో చేసిన పనులను చూసి ప్రజలు మాకు ఈ గొప్ప విజయాన్ని అందించారు. రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కూడా 90 శాతం పైగా సీట్లు గెలుచుకుంటామనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను.ఇది ప్రజా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనం. మా రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. యాదాద్రి భువనగిరి జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాము. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాము.ఈ విజయానికి సహకరించిన నాయకులు — కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు — అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఇంతటి విజయాన్ని అందించిన ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు.