Breaking News

ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు బెజవాడ బార్ అసోసియేషన్..!

విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు బెజవాడ బార్ అసోసియే షన్ ప్రెసిడెంట్ శ్రీ ఎ.కె. బాషా పర్యవేక్షణలో, ఎలక్షన్ పోలింగ్ ఆఫీసర్ శ్రీ డి.పి. రామకృష్ణ ఆధ్వర్యం లో విజయవంతంగా నిర్వ హించబడినవి. ఈ ఎన్ని కల నిర్వహణలో మాజీ అధ్యక్షులు అయిన శ్రీ చంద్రమౌళి, సీనియర్ న్యాయవాదులు శ్రీ కందుల శ్రీనివాస్ రావు, శ్రీ బుచ్చి రావు, శ్రీ అబ్దుల్ మతిన్, శ్రీ కె.బి. సుందర్, శ్రీ వకులా 40 మంది పైగా సభ్యులు పోలింగ్ ఏజెంట్లుగా సేవ లందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద సుమారు 40,000కు పైగా ఓటర్లు ఉండగా, బెజవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన 2,925 మంది ఓటర్లలో 2,524 మంది తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 143 మంది అభ్యర్థులు పోటీ చేయగా, అందులో 18 మంది అభ్యర్థులు బెజవా డ బార్ అసోసియేషన్‌కు చెందినవారు. ఈ ఎన్నికల లో మాజీ బార్ కౌన్సిల్ సభ్యులు చలసానీ అజయ్ కుమార్ సుంకర రాజేంద్ర ప్రసాద్ మళ్లీ పోటీలో పాల్గొ న్నారు. ఎన్నికల ప్రక్రియ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సజావుగా కొనసాగింది. ఎన్నికల నిర్వ హణలో పాల్గొన్న ఎలక్షన్ పోలింగ్ ఆఫీసర్ శ్రీ డి.పి. రామకృష్ణకి, పోలింగ్ ఏజెం ట్లకు, అలాగే ఎన్నికల నిర్వ హణకు సహాయ సహకా రాలు అందించిన సూర్యా రావు పేట పోలీస్ అధికా రులకు బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.బి.ఏ జనరల్ సెక్రటరీ శ్రీ కె.వి. రంగారావు, గవర్నింగ్ బాడీ సభ్యులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *