Breaking News

విద్యార్థినుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయవద్దు: దేవినేని అవినాష్

  • నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో
  • సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి

ఎ.కొండూరు ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయవద్దని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై విజయవాడ పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎ.కొండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రమైన ఎ. కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం,కళాశాలలోని వసతి గృహంలో ఎలుకలు విద్యార్థినిలను కొరికిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు స్పందించి అప్రమత్తమై పాఠశాలకు చేరుకొని మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయడం జరిగిందన్నారు. అధికారులు పచ్చ కండువాలు కప్పుకొని పని చేస్తున్నారని అవినాష్ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య,ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఛైర్మన్ శావల దేవదత్, నియోజకవర్గ కూటమి నాయకులు అప్రమత్తమై పాఠశాలకు చేరుకొని విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు.గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు నీ మైండ్ లో ఉంచుకొని అవే మాటలు మీడియా సాక్షిగా మాట్లాడుతున్నావని అవినాష్ పై రమేష్ రెడ్డి మండిపడ్డారు.ఈ సమావేశంలో మండల టిడిపి భరోతు పీక్లా నాయక్, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి.బి. భీమా నాయక్, టిడిపి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు చందు నాయక్, నాయకులు పాల్గొన్నారు.

ఫలించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వ్యూహం

కరీంనగర్ కార్పొరేషన్ లో వికసించిన కమలం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *