Breaking News

సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయాలు.

  • బాలికలను పరామర్శిస్తున్న దేవినేని అవినాష్.
  • సమావేశంలో మాట్లాడుతున్న అవినాష్.

ఎ.కొండూరు ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక): మండల కేంద్రమైన ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కళాశాలలోని వసతి గృహాన్ని శుక్రవారం వైఎస్ఆర్ సి పి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎలుకల దాడిలో గాయపడ్డ బాలికలను పరామర్శించి వసతి గృహంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వసతి గృహంలో 12మంది బాలికలను ఎలుకలు కరిస్తే విషయం బయటకు పొక్కకుండా పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచటం దుర్మార్గమైన చర్యని ఖండించారు.ఇక్కడ చదివే బాలికలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించిలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.విద్యార్ధినుల సమస్యలు వింటే గుండె తరుక్కు పోతుందని,వాళ్ళకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని,కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమన్నారు.డార్మిటరీలో పిల్లలు పడుకునే చోట ఎలుకలు పట్టే బోన్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందన్నారు. అపరిశుభ్రత వాతావరణంలో విద్యార్ధినులు చదువును అభ్యసిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల చదువు బాధ్యత,నాది అని ప్రగల్బాలు పలికే మంత్రి నారా లోకేష్ నేడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.గత ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో చదువులు,పాఠశాలల రూపురేఖలు, పౌష్టికాహారం చాలా బాగుండేదన్నారు.ఈ కూటమి రెండేళ్ల పాలనలో మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని విద్యార్థినిలు తెలిపి వాపోయారన్నారు.పౌష్టికాహారంలో భాగంగా ఆదివారం పూట పెట్టే చికెన్ కూడా వడ్డించటం లేదని,ఎలుకలు,దోమలు గురించి కొత్తగా చంద్రబాబుకు చెప్పాల్సిన పనిలేదని వ్యంగ్యంగా మాట్లాడారు.గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుక కరవడంతో చిన్నారి మృతి చెందిన విషయం పాఠకులకు విధితమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లు ఖర్చుచేసి ఎలుకలు,పట్టే కార్యక్రమం దోమలపై దండయాత్ర అన్నారు.
దోమలపై దండయాత్రను విస్మరించి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు.నాడు నేడు పథకం ద్వారా సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధిపై వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు.ఒక్కనాడైనా పిల్లల చదువులు,వారి భవిష్యత్తు గురించి చంద్రబాబు ఒక సమావేశం నిర్వహించారా అని ప్రశ్నించారు.చాలా సంతోషం బాలికలపై ఎలుకలు దాడి చేసిన సంఘటన అనంతరం ఆర్డీవో పిల్లలతో కలిసి భోజనం చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారానికి ఒక్కసారైనా ఆర్డీవో స్థాయి అధికారి పిల్లలతో కలిసి భోజనం చేయాలన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరుగుతున్న పరిణామాలపై ఆర్డీవో కు వినతిపత్రం రూపంలో తెలియజేశామని,జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్యల్ని వివరిస్తామని తెలిపారు.పసుపు కండవాలు వేసుకొని పని చేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజల సంక్షేమ కోసం పనిచేయాలని,ఎక్కడైతే సమస్య తలెత్తుతుందో అక్కడ తప్పని సరిగా ప్రతిపక్ష పార్టీగా వైసిపి ప్రశ్నిస్తుందని అవినాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి స్టేట్ గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రెటరీ నరేడ్ల వీరారెడ్డి, జడ్పిటిసి సభ్యులు, భూక్యా గనియా, యరమల రామచంద్రారెడ్డి, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు కాలసాని చెన్నారావు (రాడ్) తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్, అత్తనూరి వెంకట్ రెడ్డి, ఉమామహేశ్వరరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫలించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వ్యూహం

కరీంనగర్ కార్పొరేషన్ లో వికసించిన కమలం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *