Breaking News

ప్రతిష్టాత్మకంగా లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహణ.

విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాసనసభ–శాసనమండలి సభ్యులకు సంబంధించిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహణలో భాగంగా, ఈరోజు విజయ వాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉన్న క్రీడావే దికలు, మైదానాలు, మౌలి క వసతులను శాప్ చైర్మన్ రవి నాయుడు, విజయవా డ మున్సిపల్ కార్పొరేషన్ మరియు శాప్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సంద ర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొనే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా కార్య క్రమానికి ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పా ట్లు అత్యున్నత ప్రమాణా లతో ఉండాలని అధికారు లకు స్పష్టమైన సూచనలు చేశారు. అలాగే నిర్వహణ కు సంబంధించి క్రీడా మైదా నాల స్థితి, డ్రెస్సింగ్ రూము లు, గ్యాలరీలు, లైటింగ్, భద్రతా ఏర్పాట్లు తదితర మౌలిక వసతులను సమ గ్రంగా పరిశీలించి అవసర మైన మెరుగుదలలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026 ద్వారా ప్రజా ప్రతినిధుల మధ్య ఐక్యత, స్నేహభావం మరింత బలో పేతమవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి మరియు మౌలిక వసతుల విస్తరణ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందనడానికి ఈ క్రీడా వేడుక ఒక నిదర్శ నమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధు లకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, క్రీడా స్ఫూర్తి ని ప్రోత్సహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, నిర్ణీత కాలపరిమితిలో పనులు పూర్తి చేసి లెజిస్లే టివ్ స్పోర్ట్స్ మీట్‌ను విజ యవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమ న్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ క్రీడా కార్యక్రమం ద్వారా రాష్ట్రం లో క్రీడా సంస్కృతి మరి త విస్తరించడంతో పాటు ప్రజలకు కూడా సానుకూల సందేశం చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *