బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులురూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిటి

ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులురూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిటి

పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు డిటి నాగేంద్ర కుమార్ దొరికిపోయాడు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి సీతారామారావు మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం కుమార కాల్వ గ్రామంలో మసీదుకు సంబంధించిన సుమారు 30 ఎకరాల పొలాలను కొంతమంది ఆక్రమించుకొని అక్రమంగా పట్టాలు పొందారన్నారు. ఈ విషయమై సదరు కుమార కాలువ గ్రామ నివాసి కరీముల్లా 2024 నవంబర్లో కడప కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం సదర్ డిటి నాగేంద్ర కుమారులు కలుసుకొని ఆక్రమించిన భూములను మసీదు పేరిట బదలాయించాలని కోరారు అన్నారు. తనకు పదివేల రూపాయలు లంచం ఇస్తే భూములను మసీదుకు వదల ఇస్తానని డిటి తెలియజేశారు. దీంతో కరీముల్లా కడప ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాను తన సిబ్బందితో కలిసి స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో డీటీని కలిసామన్నారు. లంచం తీసుకున్న విషయం దొరికిపోవడంతో వీటిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అతను వసూలు చేసిన పదివేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ విషయమై మరింత లోతుగా విచారించి విచారణ అనంతరం డిటి నాగేంద్ర కుమార్ ను కర్నూల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వెల్లడించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు