బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

46 వారాలు సేవా భావంతో సాగుతున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరం

46 వారాలు సేవా భావంతో సాగుతున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరం

మంత్రి నారా లోకేష్ సేవాస్ఫూర్తితో సేవా కార్యక్రమం.

టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి.

ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం – డా. మాధవిలత.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిరంతరంగా 46 వారాలుగా విజయవంతంగా కొనసాగుతున్నట్లు డాక్టర్ మాధవిలత తెలిపారు. మంత్రి నారా లోకేష్ సేవాస్ఫూర్తితో, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ప్రతి గురువారం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.సన్ ఫ్లవర్ హ్యాండ్లూమ్ వస్త్ర దుకాణం వద్ద ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఈ శిబిరం ద్వారా వారానికి వందమందికి పైగా రోగులకు ఉచిత హోమియోపతి వైద్యం అందించడంతో పాటు అవసరమైన మందులను కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఈ వైద్య శిబిరం ద్వారా విశేషంగా లబ్ధి పొందుతున్నారని వారు పేర్కొన్నారు.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులు పాల్గొని సాధారణ రోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా దీర్ఘకాలిక వ్యాధులు, చర్మవ్యాధులు,కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, ఆయాసం,నీరసం, అలెర్జీలు వంటి సమస్యలకు వైద్యం అందుతుండటంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఈ సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.