Breaking News

డ్రగ్స్ రహిత ఎ.కొండూరు గా తీర్చిదిద్దాలి: ఏసిపి వై.ప్రసాదరావు

  • చీమలపాడులో డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీ దృశ్యాలు.
  • విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పాలి.

ఎ.కొండూరు ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మైలవరం ఏసిపి వై ప్రసాద్ రావు పేర్కొన్నారు.ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీ శనివారానికి 19వ రోజుకు చేరుకుంది.ఎ.కొండూరు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీలో తిరువూరు సిఐ కె.గిరిబాబు,ఎ.కొండూరు ఎస్ ఐ గంధం మహా లక్ష్మణుడు,నాలుగు మండలాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎ.కొండూరు మండలం చీమలపాడు పెట్రోల్ బంకు వద్ద నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ మెయిన్ సెంటర్ నుండి కొత్తూరు సెంటర్ మీదగా పాతూరు వరకు కొనసాగింది.పాతూరు సెంటర్ లో ఏ ఏ ఎం టి కే దర్బార్ బాబె బొగ్దాద్ షరీఫ్ పీఠాధిపతి,సజ్జదా నషీన్ పీర్జాద సూఫీ మొహమ్మద్ ఖాజా మొహియుద్దీన్ షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా సైకిల్ ర్యాలీకి ఘన స్వాగతం పలికి దీవించారు.ఈ సందర్భంగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మహిళా పోలీసులకు శాలువలతో ఘనంగా సత్కరించారు. పోలీస్ అధికారులు,సిబ్బందికి, గ్రామస్తులు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యువత భవిష్యత్తు కాపాడాలనే లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సమాజం మొత్తాన్ని మత్తురహితంగా మార్చే దిశగా ఈ ఉద్యమం ప్రజా ఆదరణతో శక్తివంతంగా ముందుకు సాగుతోందన్నారు. అంతకుముందు పోలీస్ ఉన్నతాధికారులకు, సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ జిల్లా మహిళా పోలీసులకు ప్రజా ప్రతినిధులకు, గ్రామస్తులకు,యువతకు గిరిజన ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలో రంగుల హారతులతో దీవించి ఘన స్వాగతం పలికారు.సాంస్కృతిక కళాకారుల,డప్పుల మోతకు తాళం వేస్తూ డ్యాన్సులతో ఉర్రూతలూగించారు. మహిళా కళాకారులు కోలాటంతో ఆకట్టుకున్నారు.వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు,యువత, ప్ల కార్డులు చేతబూని ఈ ర్యాలీలో పాల్గొన్నారు.విద్యార్థులు ప్రజలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా గళమెత్తి ప్రతిజ్ఞ చేశారు.డ్రగ్స్ వద్దు బ్రో,జీవితమే ముద్దు బ్రో, గంజాయి మత్తు జీవితం చిత్తు,సిగరెట్టు రోగానికి మొదటి మెట్టు,గుట్కా నరకానికి దగ్గరి దారి, గంజాయి స్మశానంలో చోటు ఖరారు,మత్తు పదార్థాలు ఈ మూడింటికి మించిందంటూ నినదించారు. అనంతరం కృష్ణారావు పాలెం పంచాయతీ శివారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలుర గురుకులం పాఠశాల, కళాశాలలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఏసిపి వై.ప్రసాదరావు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడికతో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. చదువుపై దృష్టి పెట్టి పాఠశాలకు,కళాశాలకు తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వల్ల మీ మెదడు పనితీరు తగ్గిపోతుందని, చదువు మీద ఆసక్తి పోతుందని, ఆరోగ్యం చెడిపోతుందన్నారు. డ్రగ్స్ వాడటం మాత్రమే కాదు వాటిని అమ్మటం కూడా చట్టపరంగా నేరమన్నారు.చిన్న వయసులోనే కేసులు పెడితే మీ కెరీర్ దెబ్బతిని, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. ఎప్పుడైనా ఒత్తిడి భయం సమస్యలు ఉంటే డ్రగ్స్ వైపు చూడకుండా ఉపాధ్యాయులతో మాట్లాడి మనోధైర్యం పొందాలని సూచించారు. డ్రగ్స్ కు ఒక అడుగు దగ్గర అయితే జీవితానికి పది అడుగుల దూరం అవుతారన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ పై దండయాత్ర కేవలం కార్యక్రమం కాదని, భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం అన్నారు.ఇది యాత్ర కాదని యువత భవిష్యత్తును కాపాడే సంకల్పం అన్నారు.డ్రగ్స్ పై ఎలాంటి సమాచారమైనా 112 కు కానీ,1972 కు కానీ తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు భరోతు పీక్లా నాయక్,ఎన్టీఆర్ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బి.భీమా నాయక్, పిఎసిఎస్ అధ్యక్షుడు బెజవాడ శంకర్, గ్రామ టిడిపి అధ్యక్షుడు కొండపాటి సుబ్బారావు, కార్యదర్శి జంగా స్టాలిన్, ఎస్సీ సెల్ నాయకులు మేకల రామారావు,జంగా కిషోర్, పంబా గిరిబాబు, తహశీల్దార్ ఎన్. అరవింద్, ఎంపీడీవో బొజ్జ గాని శ్రీనివాసరావు, ఎం ఈ ఓ2ఈ ఎల్ సి కేశవరావు, ప్రిన్సిపాల్ సిద్దయ్య, చీమలపాడు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఆర్.హైమేశ్వరరావు, తాజ్ ఖాదర్ బాబు, అధ్యాపక సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు,నాయకులు పాల్గొన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *