బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సేవాలాల్ మహారాజ్ జయంతి.

సేవాలాల్ మహారాజ్ జయంతి.

నడిగూడెం, ఫిబ్రవరి 15(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలం, ఎక్లాష్ఖాన్‌పేట తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి ధరావత్ వరలక్ష్మి డా. వెంకట రమణ ఆధ్వర్యంలో, వార్డ్ సభ్యులు గ్రామ పెద్దల సహకారంతో నిర్వహించారు.ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ఆయన బోధించిన సత్యం, ఐక్యత, సామాజిక న్యాయం, గిరిజన సమాజ అభివృద్ధి వంటి విలువలను స్మరించుకున్నారు.సర్పంచ్ మాట్లాడుతూ, గిరిజన సమాజ ఆత్మగౌరవం, విద్యాభివృద్ధి, సామాజిక సమగ్రత కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ సిద్ధాంతాలు మార్గదర్శకమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా భక్తి భావంతో భోగ్ భండారో కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామస్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బానోతు ప్రమీల, వార్డు సభ్యులు ధరావత్ అమరు, లావుడ్య కౌసల్య, ధరావత్ మదార్, బానోతు శివ, గ్రామ పెద్దలు ధరావత్ లాలు, బంగారు, బానోతు వెంకన్న, భూక్య వెంకన్న, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుక గ్రామ ప్రజల ఐక్యత, భక్తి భావం సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించింది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు