పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): లింగాల మండలం లో పట్నూతల గ్రామంలో పుట్లూరు శ్రీనివాసుల రెడ్డి అనే రైతుకు చెందిన అరటిపంట దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 8 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సాగు రైతు అంచనా వేశారు. గుర్తుతెలియని ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్ల అరటి తోటకు మంటలు వ్యాపించి పూర్తిస్థాయిలో నష్టం జరిగి ఉందని రైతు అంచనా వేశారు. ఈ సందర్భంగా రైతు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తాను నాలుగు ఎకరాలలో అరటి సాగు చేశానన్నారు. పంట సాగుకు సుమారు 8 లక్షల రూపాయల దాకా పెట్టుబడి వినియోగించానని తెలిపారు. గెలలు వేసి ఇక నెలలోపు దిగుబడి చేతికి అందాల్సి ఉందన్నారు. ఈ సమయంలో దిగుబడితో పాటు సాగుకు వినియోగించిన డ్రిప్ పరికరాలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయన్నారు. ఈ స్థితిలో ప్రభుత్వ స్పందించి పూర్తిస్థాయిలో పరిహారం అందజేయాలని శ్రీనివాసుల రెడ్డి విజ్ఞప్తి చేశారు.
