Breaking News

రసవత్తరంగా బండలాగుడు పోటీలు.

పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా వీరపు నాయుని పల్లి మండలం అనిమెల శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటుచేసిన బండలాగుడు పోటీలు రసవత్తరంగా సాగాయి. పోటీలను మాజీ రాజ్యసభ సభ్యులు తులసి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని, మనుషుల మధ్య అనురాగాలు, ఆప్యాయతలు,అనుబంధాలు పండుగల ద్వారా పెరుగుతాయని అన్నారు. మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగని, మాఘమాసం బహుళ చతుర్దశి నాడు ఈ పండుగ వస్తుందని అన్నారు. మహాశివరాత్రి నాడు శివుడు లింగాకారంలో ఆవిర్భవించినట్లు శివపురాణం చెబుతుంది. మహాశివరాత్రి నాడే శివపార్వతుల కళ్యాణం జరిగింది.ఈ రాత్రి శివుడు తన ఆనందతాండవాన్ని ప్రదర్శించాడు. లోక కళ్యాణం కోసం మహాశివరాత్రి నాడే శివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు. త్రిమూర్తులలో ఒకడైన శివునికి సంబంధించిన పర్వదినమే మహాశివరాత్రి అన్నారు. మహాశివరాత్రి ని భక్తిశ్రద్ధలతో ఆచరించి, జాగరణ చేసి నందీశ్వరుడు, భక్త కన్నప్ప, మార్కండేయులు మొదలుగారు మోక్ష ప్రాప్తి పొందారని ప్రతీతి. సంగమేశ్వర దేవస్థానము అతి ప్రాచీనమైన దేవస్థానము. ప్రాచీన కాలంలో అగస్త్య మహాముని ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.పవిత్ర పాపాగ్ని,మగబీర నదుల సంగమ స్థలంలో దేవాలయం వెలసింది కాబట్టి దీనికి సంగమేశ్వర దేవస్థానం అన్న పేరు వచ్చింది . ఒకప్పుడు అంగరంగ వైభవంగా వెలిగిన ఈ దేవస్థానం కొన్నా లపాటు మరుగున పడిందని,మళ్లీ ఇటీవల కాలంలో ప్రత్యేకించి సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ నర్రెడ్డి మురళీమోహన్ రెడ్డి కృషి వల్ల మళ్ళీ గత వైభవాన్ని సంతరించుకున్నదని అన్నారు. ఎడ్ల బండలాగుడు పోటీలు ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగాయి.గెలుపు ఓటములు సహజం పోటీలలో పాల్గొనడమే ముఖ్యమని తులసి రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ నరెడ్డి మురళీమోహన్ రెడ్డి, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు నరెడ్డి ప్రసాద్ రెడ్డి, నర్రెడ్డి సదాశివరెడ్డి, రమణారెడ్డి, ప్రధమ బహుమతి ప్రదాత నారపరెడ్డి కృష్ణారెడ్డి,ఎద్దుల యజమాని ప్లవన్ రెడ్డి,విశ్వనాథరెడ్డి,గంగులయ్య,ఈశ్వర్ రెడ్డి, రామాంజనేయరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న,తోపి రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,బండారు వెంకటేశు, నామా వినయ్,సుబ్బారెడ్డి, నాగిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు.

సామాజిక సేవలో త్రిబుల్ ఐటీ విద్యార్థులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *