Breaking News

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

హాజరైన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

కోదాడ ,ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 12 ఏళ్లు శాంతియుత మార్గంలో అలుపెరుగని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ ని అన్నారు.సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి కరువు నేలను సిరుల తెలంగాణగా మార్చి దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థాయిలో నిలిపారని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *