బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్.

బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్.

నేటి తెలుగు పత్రిక: డైవర్ట్ పాలిటిక్స్,డ్రామా పాలిటిక్స్ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు వెన్న తో పెట్టిన విద్య అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ మరియు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్,గంట శ్రీనివాస్,వరాల నర్సింగం,పర్వతం మల్లేశం,కాంతాల జగన్ రెడ్డి లతో కలిసి ఆర్ అయిండ్ బి గెస్ట్ హౌజ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం చేసుకొని ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ పై బురుద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మేము కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో క్యాంపు పెట్టుకుంటే ఆగమేఘాల మీద ఇండిపెండెంట్ లకు బీజేపీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని నరేందర్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ ప్రజలు బీజేపీ ఎంపి ని బీజేపీ ఎమ్మెల్సీని బీజేపీ మేయర్ ను గెలిపించారని ఇప్పటివరకు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలకు చేసిందేమీ లేదని ఇప్పటికైనా మొన్న కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తామని అనేక హామీలు ఇచ్చారని వాటన్నిటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా చిత్తశుద్ధితో పని చేస్తుందని అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరస్తుందని ఇంకా మిగిలిపోయిన పథకాలు అమలు చేస్తామని అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మీ చిత్తశుద్ధిని ప్రదర్శించమని నరేందర్ రెడ్డి కోరారు.ఇప్పటికైనా విజ్ఞులైన ప్రజలు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.ఈ విలేకరుల సమావేశంలో ఎండి చాంద్,ఎండి లాయక్, ముల్కల కవిత,జ్యోతిరెడ్డి,వీర దేవేందర్,బషీర్,భారీ,కీర్తి కుమార్,హనీఫ్,ఫజల్,జమీల్,యోనా,నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు