Breaking News

విద్యార్థినిల స్వీయ రక్షణకు కరాటే శిక్షణ దోహదం: ఏఎన్ఎం హైస్కూల్ ప్రిన్సిపాల్ ఏ పూర్ణచంద్రారెడ్డి.

పామర్రు, ఫిబ్రవరి 24(నేటితెలుగుపత్రిక ): విద్యార్డులస్వీయ రక్షణకు కరాటే శిక్షణ ఎంతో దోహదంగా నిలుస్తుందని పామర్రు ఏఎన్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ అన్నప్పరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. ఈనెల 22న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు లో నిర్వహించిన సౌత్ జోన్ కరాటే ఛాంపియన్షిప్ లో ఏఎన్ఎం విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభను కనబరిచి బహుమతులను సాధించారు. అండర్- 14 బాలుర విభాగంలో వి. హర్షిత్, కే మురారి, సాయి కార్తీక్ లు ప్రథమ స్థానంలో, వై కిషన్ ద్వితీయ స్థానంలో నిలిచినారు. ఇదే విదంగా బాలికల విభాగంలో డి. భువన శ్రీజ, డి ఝాన్సీ లక్ష్మి, జి ఎస్తేరు ప్రథమ స్థానంలో నిలిచి వెండి బంగారు పథకాలతో పాటు ప్రశంసా పత్రాలను సాధించారు. కరాటి పోటీల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులతో పాటు కోచ్ రామకృష్ణ ను మంగళవారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల సమక్షంలో ప్రిన్సిపాల్ పూర్ణచంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శా మ్యూల్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

జనగణన నమోదు తోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలకు జనగణన సర్వే ఎంతో కీలకం : పామర్రు ఎంపీడీవో కాండ్రు జ్యోతి

కాళేశ్వరం మరమ్మతులకు వేగం – సీఎం ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *