బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలి: ఎస్సై విజయ్ భాస్కర్

సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలి: ఎస్సై విజయ్ భాస్కర్

పామర్రు, ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక ): సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని పామర్రు ఎస్సై-2 విజయ భాస్కర్ సూచించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఆయన మంగళవారం పామర్రు తమ్మా కోటమ్మ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టాలు, సైబర్‌ నేరాలు, వ్యసనాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
పిల్లలకు సమాజం లో జరిగే సామాజిక అంశాలపై సరైన అవగాహన కల్పిస్తే, రేపటి సమాజం మరింత భద్రమవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సురక్షిత ప్రయాణ పద్ధతులు, రోడ్డు పై ఎలా సురక్షితంగా నడవాలి, రోడ్డు దాటేటపుడు పాటించాల్సిన నియమాలు, సైకిల్ నడిపేటప్పుడు, కుటుంబ సభ్యులతో కార్, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్, సీటుబెల్ట్ వాడక ప్రాముఖ్యత, రోడ్ల పై మొబైల్ వాడకం వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు అవగాహన కల్పించినట్లు చెప్పారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారమివ్వాలని అవగాహన కల్పించారు. ప్రస్తుతo Digital arrest , Job Fraud , Cyber slavery, Cyber stalking, APK ఫైల్స్‌ ఓపెన్‌ చేయొద్దని, వాటివల్ల జరిగే మోసాలు ఎక్కువగా ఉన్నాయని, వీటి పైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్‌మీడియాపై జాగ్రత్తగా ఉంటూ కెరీర్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వారికి వివరించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వారియర్స్ గా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి భాస్కర్ రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు