Breaking News

గ్రామీణ ప్రాంత ప్రజలకు కూచిపూడి సిలికానాంధ్ర ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు పట్ల కలెక్టర్ డీకే బాలాజీ సంతృప్తికరం

పామర్రు ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక ): కూచిపూడి లోని సిలికాన్ ఆంధ్ర సంజీవని వైద్యాలయంలో వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆరా తీశారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం ప్రముఖ నాట్య క్షేత్రమైన కూచిపూడి లోని సిలికాన్ ఆంధ్ర రవి ప్రకాష్ సంజీవని వైద్యాలయాన్న సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్యాలయంలోని అత్యవసర విభాగం, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే , కార్డియో తోరాసిక్, ప్రసూతి విభాగం, క్యాంటీన్ తదితర విభాగాలను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి కలెక్టర్ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ వైద్యం బాగా చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ఎక్కడనుండి వస్తున్నారని కలెక్టర్ కోరగా పామర్రు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చామని చెప్పారు.

ప్రసూతి విభాగంలో తల్లి పిల్లలను కూడా కలెక్టర్ విచారించి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ బాగున్నామని, చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చామని మొదటి నుండి ఈ వైద్యాలయంలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నామని కలెక్టర్కు వివరించారు.ఈ సందర్భంగా వైద్యాలయం వ్యవస్థాపక అధ్యక్షులు సీఈవో డాక్టర్ కూచిభట్ల ఆనంద్ మాట్లాడుతూ 2018 సంవత్సరంలో దాతల సహకారంతో ఈ వైద్యాలయాన్ని ఆహ్లాదకర గ్రామీణ వాతావరణంలో నిర్మించామని జిల్లా కలెక్టర్కు వివరించారు. రోజుకు 450 మంది దాకా ప్రజలు వైద్య చికిత్స కోసం వైద్యాలయానికి వస్తుంటారని చెప్పారు.ఒక మంచి అధికారి ఉంటే దేశం బాగుపడుతుందని విన్నాము గాని ప్రస్తుతం నేరుగా మిమ్మల్ని చూస్తున్నామని అంటూ జిల్లా కలెక్టర్ ను అభినందించి శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఒక వ్యవస్థ బాగా నడవాలంటే మంచి నాయకుడు అవసరమని, జిల్లా కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.వైద్యాలయంలో డయాలసిస్ రోగులకు తప్ప మిగిలిన వారందరికీ ఎన్టీఆర్(ఆరోగ్యశ్రీ ) వైద్య సేవలు అందుతున్నాయని డయాలసిస్ రోగులకు కూడా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని సీఈఓకు సూచించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి

అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థానిక ప్రతినిధి బెల్లంకొండ వెంకటేశ్వరరావు కూడా జిల్లా కలెక్టర్ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మొవ్వ మండల తహసీల్దారు మస్తాన్, ఎంపీడీవో సుహాసిని, గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకట విజయలక్ష్మి సిలికాన్ ఆంధ్ర వైద్యాలయం ఏవో హనుమ కుమారు, మేనేజర్ సత్య ప్రకాష్, సిద్దేంద్ర యోగి నాట్య కళా పీఠం లైబ్రేరియన్ ఫణి తదితరులు పాల్గొన్నారు.

అటవీ భూమిలో మట్టి తవ్వకాలు జరుపుతున్న జెసిబి, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *