Breaking News

నియోజకవర్గం కేంద్రమయిన పామర్రు పట్టణంలో టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోశని వారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు.

పామర్రు,ఫిబ్రవరి 28( నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గం కేంద్రమయిన పామర్రు పట్టణంలో టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోశని వారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. మొదట కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా సీనియర్ నాయకులు మాట్లాడుతు రోజురోజుకు పెరిగి పోతున్న రేడిమేడ్ రంగం ప్రభావంతోదర్జీ వృత్తి పై ఆధారపడి జీవించే అనేక కుటుంబాల పరిస్థితి ఆగమ్యగో చరంగా మారిందన్నారు. దర్జీ వృత్తి స్థితిగతులపై రాజకీయ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళ వలసిన ఆవశ్యకతను వివరించారు. దీని పై ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి మరో మారు విన్నవించడం జరుగుతుందన్నారు. దర్జీలకు ప్రభుత్వం అండగా ఉండే ల చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం స్థానికంగా టైలర్ దినోత్సవ పురస్కరించని బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పళ్ళు రొట్టెలను పంపిణీ చేశారు. టైలర్ సంఘ అధ్యక్షుడు కానోళ్ల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో టైలర్స్ సంఘ నాయకులు, అర్జెంపూడి మాణిక్యాలరావు, దునుకు దుర్గాప్రసాద్, ఎండి బాజాని, తాతా కృష్ణారావు, సుప్రీం టైలర్ వీరాంజనేయులు,టైలర్ సంఘ అధ్యక్షులు జనరేషన్ టైలర్ కానోల్ల కిషోర్, మంచాల సత్యనారాయణ, యజమానులు,కార్మికులు పాల్గొన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వేగవంతానికి ఆదేశాలు

జనగణన నమోదు తోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలకు జనగణన సర్వే ఎంతో కీలకం : పామర్రు ఎంపీడీవో కాండ్రు జ్యోతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *