బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కైవారం తాతయ్య సందేశం

కైవారం తాతయ్య జయంతి సందేశంనేడే మన కైవారం “తాతయ్య” జయంతి.శ్రీ యోగి నారాయణ యతీంద్ర గారి జయంతిని మార్చి 3వ తేదీన కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మనందరికీ గర్వకారణం.ఈ జయంతి ఉత్సవాలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బలిజ సంఘం నాయకులు, బలిజ రాజకీయ నాయకులు (MP, MLA, MLC, ZP Chairman మొదలైనవారు) హాజరుకానున్నారు.అలాగే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమీప జిల్లాలలో పనిచేస్తున్న బలిజ (రాయల్ ఫ్యామిలీ) ఉద్యోగులు కూడా ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు.1730–1840 మధ్య కాలంలో జీవించిన కైవారం తాతయ్య, అసలు పేరు నారాయణప్ప, కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో ఉన్న కైవార గ్రామానికి చెందిన ప్రసిద్ధ తెలుగు-కన్నడ వాగ్గేయకారుడు, యోగి మరియు సాధకుడు.కైవారలోని గుహలో ధ్యానం చేస్తూ ఆయన అనేక కీర్తనలు, తత్వాలు, భాగవత ప్రసిద్ధ రచనలు చేశారు. ఆయనను “కైవార నారాయణ తాత” లేదా “నారాయణ తత్తయ్య” అని భక్తులు భక్తిపూర్వకంగా సంభోదిస్తారు.ఆయన రచించిన ప్రసిద్ధ కీర్తనలలో:“జీవ నీవిది కానరా”“చందామామను చూచి వత్తామా”“నారాయణయని సారెకు దలచితే”వంటి భక్తి గీతాలు ప్రముఖమైనవి.కైవారలోని ఆయన సమాధి యోగక్షేత్రంగా భావించబడుతుంది. ఆ ప్రదేశం భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణనిచ్చే పవిత్ర స్థలంగా నిలిచింది.రాయలసీమ ప్రజల ఇళ్లలో జరిగే ప్రతి వేడుకలో కైవారం తాతయ్య గారి ఫోటోను ప్రతిష్టించి పూజలు నిర్వహించడం ఆయనపై ఉన్న భక్తి, విశ్వాసానికి నిదర్శనం.కర్ణాటక రాష్ట్రంలో చిక్కబల్లాపూర్ ప్రాంతం నుంచి సుమారు 20 జిల్లాలలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.భక్తి, తత్వం, ఆధ్యాత్మికతను సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రజలకు అందించిన మహనీయుడు కైవారం తాతయ్య గారు.ఈ పవిత్ర జయంతి సందర్భంగా ఆయన ఆశీస్సులు మనందరికీ కలగాలని మనసారా ప్రార్థిద్దాం.జయంతి శుభాకాంక్షలు.సోమరౌతు రామకృష్ణకన్వీనర్శ్రీ కృష్ణదేవరాయ ఉద్యోగ జెఏసి

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు