మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే –సమాజ అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు
మార్చి 6(నేటి తెలుగు పత్రిక): మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు కుటుంబ సర్వే ప్రారంభం కానుంది . సమాజ సమగ్ర అభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన లక్ష్యంగా ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినట్లు ఫోరమ్ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలు, విద్యావంతుల సంఖ్య, నిరుద్యోగ యువత శాతం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వివరాలు సమగ్రంగా అందుబాటులో లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు లక్ష్యబద్ధంగా అమలు కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజానికి ఒక సమగ్ర డేటాబేస్ అవసరమనే ఉద్దేశంతో ఈ డిజిటల్ సర్వే ప్రారంభించబడింది.ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన విద్యా స్థాయి, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ యువత వివరాలు, స్వయం ఉపాధి సమాచారం, ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పథకాల లబ్ధి, విదేశాల్లో ఉన్న సభ్యుల వివరాలు, వృత్తి నైపుణ్యాలు వంటి అంశాలను సేకరించనున్నారు.
డిజిటల్ యాప్ ద్వారా సమాజానికి కలిగే ప్రయోజనాలు:సమాజానికి చెందిన ఖచ్చితమైన గణాంకాల సేకరణ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి స్కాలర్‌షిప్‌లు, కోచింగ్ సదుపాయాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ సమాచారం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ స్వయం ఉపాధి అవకాశాలకు మార్గదర్శకత్వం వదేశాల్లో ఉన్న సభ్యులతో నెట్‌వర్క్ ఏర్పాటుచేసి పెట్టుబడులు, మార్గనిర్దేశం అత్యవసర వైద్య, ఆర్థిక సహాయ కార్యక్రమాల వేగవంతమైన అమలురాష్ట్రంలోని ప్రతి జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో వాలంటీర్లు నియమించి పారదర్శకంగా వివరాలు సేకరిస్తారు. ప్రతి కుటుంబం ఇచ్చే సమాచారం పూర్తిగా గోప్యంగా భద్రపరచబడుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.సేకరించిన సమాచారం ఆధారంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉద్యోగ మార్గదర్శక శిబిరాలు, స్వయం ఉపాధి ప్రోత్సాహక పథకాలు, సమాజ ఆర్థిక స్థితిగతులపై విశ్లేషణాత్మక నివేదిక వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఫోరమ్ తెలిపింది.సమాజంలోని ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పూర్తి వివరాలు అందించాలని ఫోరమ్ పిలుపునిచ్చింది. ఇది భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసే డేటా ఆధారిత అభివృద్ధి దిశగా ఒక కీలకమైన అడుగని పేర్కొన్నారు.
జిల్లా వారీగా కోఆర్డినేటర్ల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.“సమాజ ఐక్యతే శక్తి… సమాచారం ఆధారంగా అభివృద్ధి సాధ్యం.”
