బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

పది పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

పది పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

మంచిర్యాల కలెక్టర్ దీపక్ కుమార్
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు

బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక): పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్య విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా లోని బెల్లంపల్లి పట్టణంలో గల బజార్ ఏరియా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలో 48 10వ తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు నిరంతర విద్యుత్ సరఫరా, వెలుతురు, ఫ్యాన్లు, మూత్రశాలలు అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డితో కలిసి సందర్శించారు. అదనపు తరగతి గదులు, భోజనశాల నిర్మాణ పనులను త్వరితగతను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులకు అందుతున్న బోధన, మధ్యాహ్న భోజనం వివరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా రామ్ నగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం కన్నేపల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఉద్యోగుల హాజరు పట్టుకను పరిశీలించారు. మండల పరిషత్ ఉద్యోగులు, ఇబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, విధుల్లో సమయపాలన పాటించాలని సూచించారు. కార్యాలయంలో అందుబాటులో లేని టైపిస్ట్ కు శోకాదు నోటీసు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు