Breaking News

రైతు భరోసా నిధుల విడుదల.. 45 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ: రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయం అందించే “రైతు భరోసా” నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను విడుదల చేసిన సీఎం, రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. వచ్చే 45 రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్లు రైతులందరికీ చేరనున్నట్లు ప్రకటించారు. అదే కార్యక్రమంలో నంగునూరు మండలం నర్మెట్టలో కేవలం 17 నెలల్లో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. జిల్లాలో రూ.775 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.సభలో మాట్లాడిన సీఎం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పంటల మార్పిడి విధానం అవసరమని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు పెంచడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

తిరువూరు నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులకురంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా యూరియా, గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకు ముందుగానే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రామగుండం యూరియా ఉత్పత్తిని రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు.రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం రైతు సంక్షేమంపై రెండింతలకుపైగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ, బోనస్, బీమా, నష్టపరిహారం వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు అందిస్తున్నామని చెప్పారు.అలాగే ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఉన్న 3 లక్షల ఎకరాలను 10 లక్షల ఎకరాలకు పెంచినా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు లాభదాయక పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజ నరసింహ తదితర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1600 రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని రైతులు వీక్షించారు.

కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్ – “ఇక టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ కాదు.. వన్ ఇండియన్ సినిమా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *