పామర్రు, మార్చి 31(నేటి తెలుగు పత్రిక ): ప్రజా సమస్యల పట్ల నిరంతరం ఎలాంటి ప్రలోబాలకు లోను కాకుండా ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తన కలంతొ ప్రతి నిత్యం ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి సీనియర్ పాత్రే కేయులు టి సత్య నారాయణ (సత్య ) నని పలువురు వక్తలుపేర్కొన్నారు.పామర్రు పట్టణంలోని శివా స్టూడియోల లో మంగళవారం సత్య జన్మదినవేడు కలను ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ సందర్బంగా సత్య చేతులు మీదగా కేక్ కటింగ్ చేయిoచారు. పలువురు కూటమి పార్టీ, మరియు వామపక్ష పార్టీ నేతలు సత్య మిత్రులు మాట్లాడుతూ, పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ నీతికి నిజాయితీకి నిలబడుతూ సమాజానికి మంచి సేవలు అందిస్తున్న సత్య భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని,ఆపదలో ఉన్నమన్నా అని వెళ్లే వారికీ కొండoత అండగా నీలిచే వ్యక్తి సత్యన నేనాన్నరు. అనంతరం సత్య ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. తన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎంతో అభిమానంతో నన్ను సత్కరించడం, ఆప్యాయత అనురాగాలు పంచటం తాను మరువలేనని సత్య కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నేతలు బరికెల భీమేశ్వరరావు, దునుకు రఘునాధరావు, సని శెట్టి శ్రీనివాసరావు, ఎంపీటీసీ కూనపరెడ్డి సుబ్బారావు పాత్రికేయ మిత్రులు చిన్నoసుధాకర్, విలాసాగరపు శివకృష్ణ, చింతలపూడి నాగరాజు పెనుమల ప్రతాప్,తదితరులు పాల్గొన్నారు.
సత్యా జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆయన మిత్ర బృందం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారరు.ఇదిఇలాఉండగా రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ చందు జనార్ధన్ నాయుడు, డిప్యూటీ కలెక్టర్లు స్వామి నాయుడు సుబ్బారావు తో పాటు గా పలువురు రాష్ట్ర ప్రభుత్వ జిల్లాస్థాయి ముఖ్య అధికారులు మాజీ అధికారులు, సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషనర్ కేవీ చౌదరి, మాజీ రాష్ట్ర రెవిన్యూ శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి ఎంఎండి ఇంతియాజ్, సీనియర్ సివిల్ జడ్జి మాధవి సిఐడి విభాగం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తది తర అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ స్వచ్చoద సేవ సంస్థ అధినేత లు సిబ్బంది సత్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
