Breaking News

పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణకు హ్యాట్రిక్ విజయం

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ విజయంతో హ్యాట్రిక్ సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోలీసు సిబ్బందిని అభినందిస్తూ, ఈ విజయం వారి కృషి, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ సీఐడీ ఆధ్వర్యంలో అందించిన శిక్షణ ఈ విజయానికి కీలకమైందని చెప్పారు. డీజీపీ బి. శివధర్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీ చారు సిన్హాను ప్రత్యేకంగా అభినందించారు.ఇప్పటికే 2024లో లక్నో, 2025లో రాంచీలో జరిగిన పోటీల్లో విజయం సాధించిన తెలంగాణ, తాజాగా నాగ్‌పూర్‌లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లోనూ సత్తా చాటి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.ఈసారి పోటీల్లో యాంటీ-సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగాల్లో విజేతగా నిలిచిన తెలంగాణ, శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు, పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచి తన ప్రతిభను మరోసారి నిరూపించింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *