Breaking News

బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ ట్రాఫిక్‌కు చెక్.. కొత్త మార్పులు అమల్లోకి

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చౌరస్తాను సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో వాహనాలు యూటర్న్‌లు లేకుండా సాఫీగా ప్రయాణించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు ట్రాఫిక్ నిర్వహణలో మార్పులు చేపడుతున్నారు.ఈ మార్పుల భాగంగా ట్రాఫిక్ పోలీసులు వన్‌వే ట్రయల్ రన్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ ప్రయోగం కొనసాగనుంది. భవిష్యత్తులో ఇదే రూట్‌లో ట్రాఫిక్‌ను అమలు చేసే అవకాశముంది.ఐటీ కారిడార్‌కు కీలకమైన ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణం సులభం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. నగరవాసులు ట్రాఫిక్ మార్పులను గమనించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *