Breaking News

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. బాధితురాలు మైనర్ అని పోలీసుల నిర్ధారణ

మే 15, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో బాధితురాలి వయస్సుకు సంబంధించిన అంశంపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా బాధితురాలు సమర్పించిన జనన ధృవీకరణ పత్రాన్ని అధికారులు పరిశీలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె జన్మించినట్లు గుర్తించిన పోలీసులు, సంబంధిత సంవత్సరానికి చెందిన జీహెచ్‌ఎంసీ జనన రికార్డులను కూడా తనిఖీ చేశారు.పోలీసుల పరిశీలనలో బాధితురాలు మైనర్ అనే విషయం ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఆధారాలను కేసు దర్యాప్తులో కీలకంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే కేసుకు సంబంధించిన పలు కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *