Breaking News

పరువు నష్టం ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్

మే 15, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ మరియు కొన్ని మీడియా వేదికల్లో పరువు నష్టం కలిగించే ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.తన కుమారుడు భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు నేపథ్యంలో తన పేరును దుర్వినియోగం చేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో తన పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వినియోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.అలాగే ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికల్లో ప్రచారంలో ఉన్న వీడియోలు, పోస్టులు మరియు కథనాలను తొలగించాలని కూడా విజ్ఞప్తి చేశారు.పిటిషన్‌ను విచారించిన సిటీ సివిల్ కోర్టు, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ప్రచారంలో ఉన్న కొన్ని పోస్టులు, వీడియోలను తొలగించాలని సంబంధిత వేదికలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనపై కొత్త కథనాలు లేదా ప్రచార కంటెంట్ ప్రసారం చేయొద్దని కూడా న్యాయస్థానం సూచించింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *