Breaking News

ఏపీ సీఎస్ సాయి ప్రసాద్‌కు మరో ఆరు నెలల పొడిగింపు

మే 15, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలపడంతో ఆయన జూన్ 1 నుంచి నవంబర్ 30, 2026 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు.ఈ మేరకు కేంద్ర సిబ్బంది, సాధారణ పరిపాలన శాఖ (డీఓపీటీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. AIS రూల్ 16(1)(DCRB) 1958 ప్రకారం ఈ పొడిగింపును మంజూరు చేసినట్లు డీఓపీటీ అండర్ సెక్రటరీ రాజేశ్ కుమార్ యాదవ్ వెల్లడించారు.ఈ నెలాఖరుతో సాయి ప్రసాద్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ప్రభుత్వ పరిపాలనా అవసరాల దృష్ట్యా ఆయన సేవలను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాయి ప్రసాద్ మరో ఆరు నెలలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.

పుట్టపర్తిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టులకు శ్రీకారం.. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తు: రాజ్‌నాథ్ సింగ్

ఏఎంసీఏతో రక్షణ రంగంలో ఏపీకి కొత్త గుర్తింపు: పవన్ కల్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *