Breaking News

ఐపీఎల్ టికెట్ స్కామ్‌లపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక.. నకిలీ యాప్‌లతో భారీ మోసాలు

మే 16, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల సందడి పెరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు అభిమానులను టార్గెట్ చేస్తున్నారు. ఉప్పల్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ టికెట్ల పేరుతో నకిలీ యాప్‌లు, ఫేక్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా భారీ మోసాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు.ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికల్లో “తక్కువ ధరలకు టికెట్లు”, “వీఐపీ పాస్‌లు”, “లాస్ట్ మినిట్ ఆఫర్లు” అంటూ ఆకర్షణీయ ప్రకటనలు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు. అధికారిక టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగా కనిపించే నకిలీ యాప్‌లను రూపొందించి డబ్బులు దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు.మొదట టికెట్ బుకింగ్ పేరుతో చెల్లింపులు తీసుకుని, తర్వాత “పేమెంట్ ఫెయిల్ అయింది”, “సీట్ కన్ఫర్మేషన్ కోసం మరోసారి చెల్లించాలి” అంటూ మళ్లీ డబ్బులు అడుగుతున్నారని వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, యూపీఐ పిన్‌లు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అధికారిక యాప్‌లు, గుర్తింపు పొందిన వెబ్‌సైట్ల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దని, అపరిచిత ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించారు.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *