బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

హైదరాబాద్‌లో హనీట్రాప్ కలకలం.. నిందితురాలు అరెస్ట్

హైదరాబాద్‌లో హనీట్రాప్ కలకలం.. నిందితురాలు అరెస్ట్

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ సివిల్ సప్లయిస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారినట్లు సమాచారం.తర్వాత ఇద్దరూ కలిసి గడిపిన వ్యక్తిగత ఫొటోలు, ఓయో గదుల బుకింగ్ స్లిప్పులను ఆధారాలుగా చూపిస్తూ బాధితుడిని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పలు దఫాలుగా అతడి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి