Breaking News

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఈనెల 23న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ పథకాలు, ఆసరా పింఛన్లు, తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు సహా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.ప్రత్యేకంగా సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, కొత్త మార్గదర్శకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా క్యాబినెట్‌లో చర్చ జరగనుంది.ఇదే సమయంలో పలు శాఖలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లు, పరిపాలనా నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపైనా మంత్రివర్గం సమీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *