Breaking News

హైదరాబాద్‌లో 16 వేల మెడికల్ షాపులు బంద్

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని సుమారు 16 వేల మెడికల్ షాపులు ఇవాళ బంద్ పాటించనున్నాయి. ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.స్థానిక మెడికల్ షాపులకు కేవలం 25 శాతం వరకు మాత్రమే మార్జిన్ వస్తుండగా.. ఆన్‌లైన్ ఫార్మసీలు 40 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్లు ఎలా ఇస్తున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆన్‌లైన్ ఫార్మసీలపై నియంత్రణ తీసుకురావాలని, ఈ వ్యవస్థపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మెడికల్ షాపులు మూతపడటంతో ప్రజలు ముందుగానే మందులు కొనుగోలు చేసేందుకు పరుగులు తీశారు.

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మల్లు రవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *