Breaking News

ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది.. రేపు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరింత పెరుగనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించిందిపశ్చిమ గోదావరి, పోలవరం ప్రాంతాల్లో 50 డిగ్రీల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీఎస్‌డీఎంఏ అంచనా వేసింది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, కోనసీమ, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో 49 నుంచి 50 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తగినంత నీరు తాగడం, మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా ఉండడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

టంగుటూరి ప్రకాశం పంతులకు సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

మంత్రి ఫిర్యాదుతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *