Breaking News

హైదరాబాద్‌లో కిడ్నాప్ గ్యాంగ్‌ల హల్‌చల్..

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో కిడ్నాప్ గ్యాంగ్‌ల ఆగడాలు కలకలం రేపుతున్నాయి. పంజాగుట్ట ప్రాంతానికి చెందిన ఓ బంగారు వ్యాపారిని వికాస్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం.. రూ.2.75 లక్షలకు కొనుగోలు చేసిన నెక్లెస్‌లో నకిలీ రాళ్లు ఉన్నాయని ఆరోపిస్తూ గ్యాంగ్ సభ్యులు వ్యాపారిపై దాడి చేశారు. అనంతరం అతడిని బెదిరించి రూ.4 లక్షలను తమ ఖాతాలోకి ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయించుకున్నారు.అక్కడితో ఆగకుండా వ్యాపారిని ఏటీఎం వద్దకు తీసుకెళ్లి మరో రూ.1 లక్ష నగదు విత్‌డ్రా చేయించారు. తర్వాత అతడిని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులను కూడా బెదిరించినట్లు సమాచారం. వ్యాపారి భార్య వద్ద నుంచి బంగారు నగలు తీసుకెళ్లిన గ్యాంగ్.. ఆమె స్పృహ తప్పిపోవడంతో అక్కడి నుంచి పరారైంది.బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వ్యాపారి షాప్‌తో పాటు పరిసర ప్రాంతాల కెమెరాలను కూడా జల్లెడ పడుతున్నారు.ఇక అత్తాపూర్‌లో మరో మహిళ కిడ్నాప్ ఘటనపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ రెండు ఘటనలతో నగరంలో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *