Breaking News

టంగుటూరి ప్రకాశం పంతులకు సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలు, ప్రజాసేవను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పోస్టు చేశారు.“తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతతో ప్రజల కోసమే జీవించారు” అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకాశం పంతులకు నివాళులు అర్పిస్తూ.. స్వాతంత్ర్య పోరాటం నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వరకు ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ప్రజాసేవకు, ధైర్యానికి, దేశభక్తికి ప్రకాశం పంతులు నిదర్శనమని కొనియాడారు.ప్రకాశం పంతులు ఆదర్శాలను సాకారం చేసే దిశగా అందరూ పనిచేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *